ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి అనమాట..అంటే?. ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు అని. కథ సృష్టించాలంటే ఇలాగే రాస్తారు మరి.
మూర్ఖుల మనసు రంజింప రాదు, ఏంటి?, ఎవరు వాళ్ళు?, ఎందుకీ రాత? అంటారా... అంటారో, అనుకుంటారో, మీ ఇష్టం. విషయం ఏంటంటే, నాకు ఈ మధ్య బాగా కోపం వచ్చింది (కోపం నా ఒక్కడి ఆస్తి కాదు సుమా.), దాన్ని ఎలా కక్కాలో తెలీక, ఈ సారి ''ఎందుకంటా శీర్షిక'' లో ఇలా కక్కేస్తున్నా. ఏ దేశం ఏగిన, ఎక్కడపడితే అక్కడ కాలు పెట్టినా, కొన్ని మొహాలు ఉంటాయ్, వాటికి పేరు పెట్టడం కూడా చాల కష్టం. కొత్తల్లో పరిచయం చాలా బాగుంటుంది..మెల్లగా విషయం బోధపడుతుంది.

కొంతమంది ఘనులు ఉంటారు, వాళ్ళ గురించి ప్రస్తావన కొంచెం అవసరం, అందుకే ఈ వ్యాసం లో తిక్క మొహాల గురించి చెప్పుకుందాం. ఎమన్నా చెప్తే, ఏమయిపోతుందో అని, ప్రతి దానికి రొటీన్ సమాధానాలు ఇస్తారు. అవి ఇలా వినిపిస్తాయ్.
నాకు తెలీదు, నాకు తెలీదు,
నాకెలా తెలుసు, నాకెలా తెలుసు,
ఏమో, ఏమో,
అయ్యుండచ్చు, అయ్యుండచ్చు
అయినా నాకెందుకు లే,
కాకపోతే ఏంటంటే,
నాకు ఎందుకొచిన గొడవ,
నేను అయితే అలా చేసేవాడిని........
ఇలాంటి సమాధానాలు విన్నపుడల్లా వాళ్ళ మొహాల్లో రకరకాల జంతువులు ఒకేసారి దగ్గర చేరి కనిపిస్తాయి. వీళ్ళంతా, నన్ను ముట్టకు నారాయణ టైపు (చిన్నపుడు, కరెంట్ షాక్ ఆట). వంకర జవాబులు ఇవ్వకపోతే వాళ్ళకి ఊపిరి ఆడదు లేదా గొంతులో పట్టేస్తుంది. వీళ్ళ మొహాలు మండ, ఆ మాత్రం సమాధానానికి, ప్రతి దానికి ఆత్రం ఎందుకంట వీళ్ళకి?. ఊళ్ళో అన్ని విషయాలు కావాలి, అన్ని ఒకచోట కుప్ప వేస్కుని, వాటిని నమిలి, మింగి పడుకుంటేనే కాని రోజు గడవదు. అసలే ఈ ప్రపంచం అంతా ఎవడి గోల వాడిది. ప్రపంచ జనాభా లెక్కల్లో, ఈ జవాబులు ఇచ్చే ఘనులు ముందుంటారు. ..వీళ్ళేదో దేశాన్ని ఉద్దరించేట్టు అంతా క్షేమమేనా అని అడుగుతూ బతికేస్తారు.. నిజానికి వాళ్ళ లోపల మనిషి కోరుకునేది వేరు. వాళ్ళ లోపల మనిషి కి దాహం ఎక్కువ. పెద్ద గుండిగ తో నీళ్ళు తాగిన కూడా అది తీరేది కాదు. ఆ దాహార్తి తీరేది ఎలాగో ఈ పాటికి మీకు అర్ధం అయ్యి ఉంటుంది. అన్నీ అడిగినట్టే అడిగి, లేదంటే చీకట్లో ఒక రాయి వేసి, కావలసిన సమాధానం రాబట్టుకుని, హమ్మయ్య అని లోపల మనిషి అనుకుంటే గాని, బయట మనిషి మొహం లో అమాయక ఫేస్ కనిపించదు. వీళ్ళ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే, వాళ్ళని కలిసిన ప్రతిసారి ఒక పుస్తకం తయారు అవుతుంది.
సరే, ఇదంతా బాగానే ఉంది. అసలు ఇలాంటి వాళ్ళకి మన రియాక్షన్ ఎలా ఉండాలి? ముల్లు ని ముల్లు తోనే తీయాలని మనకి తెలుసు కదా. కాకపోతే మన దగ్గర కొంచెం పెద్ద ముల్లు పెట్టుకోవాలి. అవతలి వాళ్లు మన క్షేమ సమాచారాలు అడిగి అడగగానే వాళ్ళ కళ్ళలోకి మీ చూపులు పెద్దవి చేసి గుచ్చ్చి గుచ్చ్చి చూడండి. ఇలా ఓ 7 సార్లు వాళ్ళని కలిసిన మొదటి క్షణంలో గుచ్చు చూపుళ్ళు చూస్తే మీకే అర్ధం అయిపోతుంది. ఆ తరవాత వాళ్ళు మిమ్మల్ని అడిగే పద్ధతి మారిపోతుంది. ఎలా అంటారా...చాల సింపుల్ ..వాళ్ళ గురించి మీకు తెలిసిపోయినట్టు, వాళ్ళకి, మీ మొహం లో స్పష్టం గా కొబ్బరి కాయంత అక్షరాలు కనిపిస్తాయి.
మరో విషయం ఏంటంటే, అసలు వాళ్ళు అలా ఎందుకు మాట్లాడుతున్నారో కాస్త మానవతా దృక్పధంతో ఆలోచిస్తే, పాపం వాళ్ళకి వేరే వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ. అవతలి వాళ్ళు బాగుపడి పోతే, అమ్మో, ఇంకేమన్నా ఉందా..సహించలేరు, భరించలేరు. ఇందాక చెప్పినట్టు ఎవడి గోల వాడిది అయితే కథ వేరేలా ఉండేది. ఇక్కడ వేరేవాళ్ళ గోల వీళ్ళది అవటం వల్ల, కథ అడ్డం తిరిగింది. పోనీలే పాపం అని వదిలేద్దాం అనుకుంటే మళ్లీ వచ్చి ఏదో ఒక రూపం లో మీద పడతారు. 'చంటబ్బాయ్' సినిమా లో అల్లు రామలింగయ్య అన్నట్టు, అది, అలా అయిందట గదా, ఇది, ఇలా అయ్యిందట గదా అంటారు...ఏది ఎలా అయితే వీళ్ళకి ఎందుకంటా.. సహాయం చెయ్యకుండా, సలహా ఇచ్చ్చే పేస్ లు ఇవి.
వీళ్ళలోని లోపల మనిషి ఇచ్చ్చే (కాదు, వాళ్ళు అనుకునే) సమాధానాలు ఇలా ఉంటాయి. నిజానికి, ఇవి పైన చెప్పిన వాటికి పర్యాయపదాలు అని చెప్పబడతాయి. వాళ్ళ మనసులో భావం ఇలా ఉంటుంది. మరొక్కసారి ఆ పైన చెప్పిన వాళ్ళ సమాధానాలు చదివి, మళ్లీ ఇవి చదవండి.
అవి బయట వినిపించేవి అయితే, ఇవి లోపల అనిపించేవి.
నాకు తెలిసిన నేను చెప్పను,
నాకు అన్ని తెలుసు,
I know, I know.
అలా అస్సలు కాదు.
నాకు కాక ఇంకా ఎవడికి చెప్తావ్ లే.
ఐనా, నీకు అంత సీన్ లేదు
గొడవలన్నీ నేనే వినాలి..హ హహ
నేను చచ్చ్చినా అలా చేయాను
సశేషం...అంటే, ఇంకా ఉంది అని.
(కథ గూగుల్ కి, నేను ల్యాబ్ కి).....